ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం యువకుడి పిచ్చి పని.. 100 అడుగుల లోతున్న సరస్సులోకి దూకి..

జార్ఖండ్‌లోని 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరించడానికి 100 అడుగుల లోతైన క్వారీ సరస్సులోకి దూకి నీటిలో మునిగిపోయాడు.;

Update: 2024-05-22 05:25 GMT

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడానికి ఎత్తు నుండి లోతైన నీటిలో దూకి మునిగిపోయాడు. దాంతో తనను తాను నియంత్రించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. 

ఇంతకు ముందు సెల్ఫీలు, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి. లైకుల కోసం యువత పిచ్చి పిచ్చి పనులు చేస్తోంది. ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా యువతలో మార్పు రావడం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతీ యువకులు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారన్నా అర్థం ఉంది. అలాంటి వారికి దేశం మొత్తం జేజేలు కొట్టి ఘనమైన నివాళి అర్పిస్తుంది. కానీ ఇలాంటి చెత్త పనులు చేసి కన్నవారికి కడుపుకోత మిగులుస్తుంటారు ఇలాంటి వారు. ఇలాంటి ఘటనలు చూసి కొందరైన భయపడి చేయకుండా ఉంటారేమో అంటే అదేం లేదు.. మళ్లీ మామూలే.. ఆ క్షణంలో చదివి అప్రమత్తమైనా మరుక్షణమే మర్చిపోతుంటారు. ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు.. ప్రాణాలు పోగొట్టుకుంటారు. 

తౌసిఫ్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి క్వారీ సరస్సులోకి దూకాడు. సరస్సులో స్నానం చేస్తున్న అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

వెంటనే వారు స్థానికులు మరియు పోలీసులను అప్రమత్తం చేసి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన యొక్క వీడియో, అతని స్నేహితుడు రికార్డ్ చేస్తున్నప్పుడు యువకుడు నీటిలోకి దూకడం చూపిస్తుంది.  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 100 అడుగుల లోతున్న నీటిలోకి దూకిన యువకుడు తనను తాను నియంత్రించుకోలేక నీటిలో మునిగిపోయాడని తెలిపారు. 

Tags:    

Similar News