Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం గుడ్‌బై
2018లో కొత్త పార్టీ స్థాపనం.. గతేడాది మరో పార్టీలో విలీనం;
ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ పార్టీలో విలీనం చేశాడు. రాజకీయాల్లో తాను మన్నన పొందలేనని భూటియా చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో ఆరోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బార్‌ఫుంగ్‌లో 4,346 ఓట్ల తేడాతో భూటియా ఓడిపోయారు. సిక్కిం ప్రజల కోసం వాగ్దానాలు అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.