Ajit Doval: డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరిక.. రష్యా టూర్ కి అజిత్ దోవల్
ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక భేటీ..;
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై 25 శాతం టారీఫ్స్ విధించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ఈ క్రమంలో కీలక పరిణామం ఒకటి జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో భారత్-రష్యా మధ్య జరిగే చర్చల్లో అజిత్ దోవల్ పాల్గొననున్నారు.
ఇక, రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ముఖ్య లక్ష్యంగా అజిత్ దోవల్ పర్యటన చేస్తున్నారు. రష్యా నుంచి చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారంతో పాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలక అంశాలపై మాస్కో అధికారులతో ఎన్ఎస్జీ చీఫ్ దోవల్ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ నెల చివరలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్యపరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో జైశంకర్ భేటీ కానున్నారు.