Akhilesh Yadav: యూపీలో ఈద్ ప్రార్థనలపై గందరగోళం..
అఖిలేష్ యాదవ్ ను ఈద్గాకు వెళ్లకుండా ఆపిన పోలీసులు.. మండిపడిన మాజీ సీఎం..;
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో మీరట్, సహారన్‌పూర్, మొరాదాబాద్‌లలో అనేక చోట్ల ముస్లింలు పోలీసులతో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈద్ ప్రార్థనల తర్వాత ప్రజలు పాలస్తీనా జెండాను ప్రదర్శించడంతో పాటు కొంత మంది మైనార్టీలు నల్ల బ్యాండ్లు ధరించారు. ఎలాంటి అల్లర్ల జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
ఇక, లక్నోలోని ఐష్‌బాగ్ ఈద్గాకు వెళ్లారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల పట్ల ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలీసులు నన్ను ఇక్కడికి రాకుండా ఆపారు.. నేను చాలా కష్టంతో ఇక్కడి వరకు రాగలిగాను.. నన్ను ఆపడానికి ఏ అధికారి దగ్గరా సరైనా సమాధానం లేదని మండిపడ్డరు. ఇది నియంతృత్వం, ఇతర మతాల పండుగలలో పాల్గొనకూడదు అని ప్రశ్నించారు. నేడు భారత రాజ్యాంగానికి పెద్ద ముప్పు పొంచి ఉంది.. మన దేశంలో అందరం కలిసి అనేక శతాబ్దాలుగా జీవిస్తున్నాం.. కానీ, బీజేపీ ప్రజలను సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.. ఈ ప్రభుత్వంలో అవినీతి, మోసాలు కొనసాగుతున్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.