Alt News: ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఆ సోషల్ మీడియా పోస్టే కారణం..
Alt News: ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్‌కు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 4 రోజుల రిమాండ్ విధించింది;
Alt News: ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్‌కు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మరో 4 రోజుల రిమాండ్ విధించింది. ఒకరోజు కస్టోడియల్ విచారణ ముగిసిన నేపథ్యంలో జుబైర్‌ను చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఢిల్లీ పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరగా..కోర్టు నాలుగు రోజుల పాటు రిమాండ్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఓ దేవతపై అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.