ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోన్న అమరావతి నినాదం.. ఎంపీ సురేష్ తో మహిళా జేఏసీ భేటీ

అమరావతి నినాదం ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది. హస్తిన వీధుల్లో ఉద్యమహోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మహిళా జేఏసీ..

Update: 2020-09-22 08:19 GMT

అమరావతి నినాదం ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది. హస్తిన వీధుల్లో ఉద్యమహోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది మహిళా జేఏసీ. అమరావతిని కాపాడాలంటూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా నేడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ విప్‌ హోదాలో ఉన్న ఎంపీ కె. సురేష్ ను కలిశారు అమరావతి మహిళా జేఏసీ నేతలు..

అమరావతే రాజధానిగా కొనసాగిలి అన్న రైతుల డిమాండ్ న్యాయబద్దమైందే అన్నారు ఎంపీ సురేష్. సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.. రాష్ట్రంపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా మార్చడం వల్ల అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతమవుతుందని అన్నారు. అమరావతిలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతమంతా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతి విషయంలో బీజేపీ ద్వంద వైఖరిని తప్పు పట్టారు ఎంపీ సురేష్.

Tags:    

Similar News