INDIAN ARMY: దేశ సరిహద్దు చివరి గ్రామానికి ఆర్మీ అపురూప కానుక
రెండు నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి... దేశ సరిహద్దు గ్రామానికి ఇండియన్ ఆర్మీ అపురూప కానుక;
భారత ఆర్మీ(Indian Army ) మరోసారి మంచి మనసు చాటుకుంది. దేశ సరిహద్దుకు చివరి గ్రామమైన దన్నా(Danna Village )కు భారత సైన్యం అపురూప కానుకను అందించింది. 77వ స్వాతంత్ర్య సంబరాల వేళ జమ్ముకశ్మీర్‌లోని దన్నా గ్రామస్థులు(dedicated a bridge to locals of Danna ) రాకపోకలు సాగించేందుకు ఓ వంతెనను నిర్మించి అందించింది. ప్రతి ఏడాది వర్షాల వేళ మచ్చల్ నాలాను దాటేందుకు దన్నా గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండడాన్ని ఇండియన్ ఆర్మీ గుర్తించింది. మచ్చల్ నాలాపై వంతెన నిర్మించాలని సంకల్పించింది. రెండు నెలల పాటు శ్రమించి వంతెనను నిర్మించి ఈ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రారంభించింది. ఈ వంతెనకు 1965లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన మేజర్ భగత్ సింగ్ పేరు కలిసి వచ్చేలా భగత్ బ్రిడ్జ్(Bhagat Bridge )గా నామకరణం చేసింది. ఈ దన్నా గ్రామాన్ని కూడా భగత్ గ్రామంగా పిలుస్తారు.
ఈ బ్రిడ్జీ నిర్మాణంతో ఏడు గ్రామాలకు రాకపోకలు సుగమమం అవుతయాని ఆర్మీ ప్రకటించింది. రెండు నెలల స్వల్ప కాలంలోనే ఈ వంతెనను నిర్మించామని... ఈ బ్రిడ్జి నిర్మాణంతో స్థానికుల సమస్యలు చాలావరకు తీరుతాయని భారత సైన్యం తెలిపింది.