ASSAM: ఇక అస్సాంలో వాటర్‌ ప్యాకెట్లు ఉండవ్‌

లీటర్ కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌పై అస్సాం నిషేధం

Update: 2023-07-23 05:15 GMT

లీటర్ కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల(packaged drinking water)ను నిషేధించాలని... అస్సాం(Assam) ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2(October 2) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే 2024 అక్టోబర్ నుంచి 2 లీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను నిషేధిస్తామని...ఆ రాష్ట్ర C.M...హిమంత బిశ్వశర్మ తెలిపారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో "పాలిథిలిన్-టెరాఫ్తలెట్-P.E.T"(PET of less than 1 litre in volume)తో వాటర్ బాటిళ్ల తయారీ, వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2021 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమలు చేస్తామన్న ఆయన...సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం కఠినంగా అమలు చేస్తామన్నారు.ASSAM: ఇక అస్సాంలో వాటర్‌ ప్యాకెట్లు ఉండవ్‌ 

Tags:    

Similar News