Ayodhya Deepotsav 2023 : 22లక్షల దీపాల వెలుగులో అయోధ్యానగరం
ఉజ్జయిని రికార్డు బ్రేక్, గిన్నిస్‌లో స్థానం;
దివ్వెల పండుగ దీపావళి వేళ....అయోధ్యా నగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సరయునదీ తీరంలోని 51 ఘాట్లలో వెలిగించిన దాదాపు 24 లక్షల దీపాల వెలుగులో అయోధ్య ధగధగలాడుతోంది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్వహిస్తున్న ఏడో దీపోత్సవాన్ని.... ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మహాహారతి ఇచ్చి ప్రారంభించారు. ఈ దీపోత్సవం ద్వారా....ఉజ్జయిని పేర ఉన్న 18లక్షల 82వేల దీపాల రికార్డ్‌ను బ్రేక్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి 50కిపైగా దేశాల రాయబారులు హాజరయ్యారు. దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ....అయోధ్యా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.