BANGLADESH: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు

భారతీయులు.. బహుపరాక్!...ఉస్మాన్‌ హతంతో పెరిగిన దాడులు..భారత హైకమిషన్‌పై దాడి 

Update: 2025-12-20 04:30 GMT

బం­గ్లా­దే­శ్‌­లో రా­జ­కీయ సె­గ­లు మళ్లీ మొ­ద­ల­య్యా­యి. షేక్ హసీ­నా ప్ర­భు­త్వ పత­నం­లో కీలక పా­త్ర పో­షిం­చిన యువ నేత, 'ఇం­క్వి­లా­బ్‌ మం­చ్‌'  పా­ర్టీ కన్వీ­న­ర్‌ షరీ­ఫ్‌ ఉస్మా­న్‌ బి­న్‌ హైది మర­ణ­వా­ర్త ఆ దే­శా­న్ని ని­ప్పు­ల­కొ­లి­మి­లా మా­ర్చిం­ది. హైది మృ­తి­తో ఆగ్ర­హిం­చిన ని­ర­స­న­కా­రు­లు రా­జ­ధా­ని ఢా­కా­తో పాటు పలు నగ­రా­ల్లో వి­ధ్వం­సా­ని­కి ది­గా­రు. ఈ క్ర­మం­లో భారత దౌ­త్య కా­ర్యా­ల­యా­లే లక్ష్యం­గా దా­డు­లు జర­గ­డం ఇప్పు­డు అం­త­ర్జా­తీ­యం­గా ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. గు­రు­వా­రం రా­త్రి 11 గంటల సమ­యం­లో చత్తో­గ్రా­మ్‌­లో­ని భారత అసి­స్టెం­ట్‌ హై­క­మి­ష­న్‌ కా­ర్యా­ల­యం వద్ద తీ­వ్ర ఉద్రి­క్తత చో­టు­చే­సు­కుం­ది. వం­ద­లా­ది మంది ఆం­దో­ళ­న­కా­రు­లు కా­ర్యా­ల­యా­న్ని చు­ట్టు­ము­ట్టి భా­ర­త్‌­కు వ్య­తి­రే­కం­గా, అలా­గే మాజీ ప్ర­ధా­ని షేక్ హసీ­నా­కు చెం­దిన అవా­మీ లీగ్ పా­ర్టీ­కి వ్య­తి­రే­కం­గా హో­రె­త్తే­లా ని­నా­దా­లు చే­శా­రు. హై­ది­పై జరి­గిన కా­ల్పుల వె­నుక కు­ట్ర ఉం­ద­ని ఆరో­పి­స్తూ దౌ­త్య కా­ర్యా­ల­యం వె­లు­పల బై­ఠా­యిం­చా­రు. దీ­ని­తో సరి­హ­ద్దు దే­శాల మధ్య దౌ­త్య­ప­ర­మైన చి­క్కు­లు తలె­త్తే అవ­కా­శం కని­పి­స్తోం­ది. ని­ర­స­న­కా­రుల ఆగ్ర­హం మీ­డి­యా సం­స్థ­ల­పై  పడిం­ది. ఢా­కా­లో­ని ప్ర­ఖ్యాత 'డె­యి­లీ స్టా­ర్' పత్రి­కా కా­ర్యా­ల­యం­పై అల్ల­రి­మూ­క­లు దాడి చేసి ని­ప్పు పె­ట్టా­రు. రెం­డు అం­త­స్తు­లు అగ్ని­కీ­ల­ల్లో చి­క్కు­కో­గా, 25 మంది జర్న­లి­స్టు­ల­ను అతి కష్ట­మ్మీద రక్షిం­చిం­ది.

 అసలు కుట్ర ఇదే..

మనం ప్రా­ణ­దా­నం చేసి వి­ము­క్తి కల్పిం­చిన బం­గ్లా­దే­శ్‌­లో ఇప్పు­డు మళ్లీ భా­ర­త­దే­శా­ని­కి వ్య­తి­రే­కం­గా వి­ష­పు వి­త్త­నా­లు నా­టు­తు­న్నా­రు. ఫి­బ్ర­వ­రి­లో జర­గ­బో­యే బం­గ్లా­దే­శ్ ఎన్ని­క­లు, షేక్ హసీ­నా ని­షే­ధం తర్వాత, భారత జా­తీయ భద్ర­త­కు అత్యంత ప్ర­మా­ద­క­ర­మైన మలు­పు కా­ను­న్నా­యి. 'గ్రే­ట­ర్ బం­గ్లా­దే­శ్' అనే ప్ర­మా­ద­క­ర­మైన కల... భా­ర­త­దే­శం­లో­ని పశ్చిమ బెం­గా­ల్, అస్సాం, త్రి­పుర భూ­భా­గా­ల­ను కలి­పి ఏర్పా­టు చే­యా­ల­ని వి­స్త­ర­ణ­వాద సి­ద్ధాం­తం. ఈ సి­ద్ధాం­తా­ని­కి ప్ర­చా­ర­క­ర్త అయిన షరీ­ఫ్ ఉస్మా­న్ హది­పై ఢాకా వీ­ధు­ల్లో కా­ల్పుల దాడి జరి­గిం­ది. ఈ దా­డి­ని ఇప్పు­డు BNP, దాని మి­త్ర­ప­క్షా­లైన జమా­తే ఇస్లా­మీ రా­జ­కీయ ఆయు­ధం­గా మా­ర్చు­కుం­టు­న్నా­యి. వారు హది­ని 'బ­లి­ప­శు­వు­గా' చి­త్రీ­క­రి­స్తూ, రా­డి­క­ల్ ,భారత వ్య­తి­రేక శక్తుల సా­ను­భూ­తి­ని కూ­డ­గ­ట్టు­కుం­టు­న్నా­రు. హది­ని కా­ల్చిన అను­మా­ని­తు­డు ఫై­జ­ల్ కరీం మసూ­ద్ తలపై తా­త్కా­లిక ప్ర­భు­త్వం 50 లక్షల BDT రి­వా­ర్డు ప్ర­క­టిం­చి­న­ప్ప­టి­కీ, BNP దీ­న్ని 'ఎ­న్ని­కల వి­ధ్వం­సా­ని­కి పన్నిన కు­ట్ర'­గా ఆరో­పి­స్తోం­ది. ఉల్ఫా వంటి భారత వ్య­తి­రేక ఉగ్ర­వాద సం­స్థ­ల­కు బం­గ్లా­దే­శ్ మళ్లీ స్వ­ర్గ­ధా­మం అవు­తుం­ద­నే చి­కా­కు భా­ర­త­గూ­ఢ­చార సం­స్థ­ల­ను వెం­టా­డు­తోం­ది.

Tags:    

Similar News