Handloom Day: ప్రజలు క్విట్‌ ఇండియా అని నినదిస్తున్నారు...

జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మోదీ... ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్‌పై తీవ్ర విమర్శలు

Update: 2023-08-07 09:30 GMT

దేశ ప్రజలు క్విట్‌ ఇండియా(appeasement to 'Quit India) అంటూ నినదిస్తున్నారని ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. ఢిల్లీలోని భారత్‌ మండపం( Bharat Mandapam)లో జరిగిన చేనేత దినోత్సవం(National Handloom Day celebration)లో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడంపై మోదీ మండిపడ్డారు. ప్రజలు ఇప్పుడు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు. ప్రజలందరూ ప్రతిపక్ష కూటమి క్విట్‌ ఇండియా అని నినదిస్తున్నారని అన్నారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ప్రయత్నిస్తున్న వేళ కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.


స్వదేశీ( Swadeshi) నినాదంతో దేశంలో కొత్త విప్లవం వచ్చిందన్న ప్రధాని రాబోయే పండుగల(coming festivals) సందర్భంగా స్థానిక ఉత్పత్తుల(local products )కు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 2014కి ముందు 30 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ఖాదీ అమ్మకాలు ఇప్పుడు లక్షా 30 వేల కోట్లకు పెరిగాయని మోదీ అన్నారు. భారత చేనేత, ఖాదీ, టెక్స్‌టైల్ రంగాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనేది తమ ప్రయత్నమని వెల్లడించారు. ఒక జిల్లా-ఒకే ఉత్పత్తి కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో తయారైన ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నామని మోదీ తెలిపారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఉన్న ఏక్తా మాల్స్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని తెలిపారు. టెక్స్‌టైల్, ఫ్యాషన్ పరిశ్రమలు తమ పరిధిని విస్తరించుకోవాలన్న ప్రధాని భారత్‌ను ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు గణనీయంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


దేశంలో చేనేత కమ్యూనిటీ యొక్క ప్రాముఖ్యతను సూచించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 1905లో బ్రిటిష్ పాలనలో స్వదేశీ ఉద్యమంలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవం ప్రారంభమైంది. కోల్‌కతాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించిన భారతీయ ప్రముఖులు విదేశీ వస్త్రాలను బహిష్కరించడం సహా దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశీ వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఇది స్వయం, సహాయం, భారతీయ వస్తువులపై స్వీయ-ఆధారపడాలనే ఆలోచనను పెంచాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచేందుకు, చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 

Tags:    

Similar News