ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. పార్టీ చీఫ్‌లుగా కేంద్ర మంత్రులు వెళ్లనున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. రెండు మూడు రోజుల్లో జరగనున్న కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో బీజేపీ మిత్రపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వనున్నారు.
శివసేన షిండే వర్గం, ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం, లోక్‌జనశక్తి పాశ్వాన్.. జేడీయూను వీడిన ఆర్సీపీ సింగ్‌కు కేబినెట్‌లో ఛాన్స్ దక్కనుంది. తెలంగాణ నుంచి బండి సంజయ్‌తో పాటు మరొకరికి అవకాశం దక్కే ఛాన్సుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ… మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ నుంచి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.