Arvind Kejriwal: ఢిల్లీలో సీఎం ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన..
Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్ ను లిక్కర్ స్కాం కుదిపేస్తుంది. ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చారు.;
Arvind Kejriwal: ఢిల్లీ సర్కార్ ను లిక్కర్ స్కాం కుదిపేస్తుంది. ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చారు.. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం వెనుక తెలుగు రాష్ట్రాల ప్రమేయం ఉందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో బీజేపీ నేతలు ఆప్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. దీంట్లో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో సీఎం ఇంటి ముందుకు చేరుకున్న కార్యకర్తలు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.