Parliament : అందుకు సోనియా క్షమాపణ చెప్పాల్సిందే అన్న బీజేపీ
Parliament : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి;
Parliament : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే.. కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీజేపీ మహిళా ఎంపీలు సైతం ట్రెజరీ బెంచ్‌లు ఎక్కి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కౌంటర్ నినాదాలు చేశారు.
రాష్ట్రపతిపై అధీర్ చౌదరి చేసిన కామెంట్లకు సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ స్లోగన్స్ చేశారు. కొన్ని విపక్ష పార్టీలు పెరుగుతున్న ధరలు, జీఎస్టీ, అగ్నిపథ్‌పై చర్చ జరపాలంటూ సభలో ఆందోళనకు దిగారు. వాయిదా తరువాత కూడా లోక్‌సభ, రాజ్యసభలో ఇదే గందరగోళం ఉండడంతో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.