Tamilnadu: బాడీ బిల్డర్, మిస్టర్ తమిళనాడు యోగేష్ మృతి
జిమ్‌లో ట్రైనింగ్ ఇచ్చి..బాత్రూమ్కు వెళ్లి..;
గతకొంత కాలంగా కండలు తిరిగిన బాడీ బిల్డర్లు, నిత్యం జిమ్ చేసేవారు అకస్మాత్తుగా కుప్ప కూలిపోయి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలా అని వారేమో వృద్ధులు కాదు. యువకులు, మధ్య వయస్సు ఉన్నవారే మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిత్యం వ్యాయామాలు, జిమ్, ప్రత్యేకంగా డైట్.. ఇలా ఆరోగ్యం పట్ల కఠినంగా ఉండే వారే పిట్టల్లా రాలిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బాడీ బిల్డర్, మిస్టర్ తమిళనాడు విజేత యోగేష్ కూడా అదే విధంగా చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న యోగేష్ యువకులకు శిక్షణ ఇచ్చిన అనంతరం బాత్రూమ్కు వెళ్లాడు. అనంతరం అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూర్మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధికి చెందిన యోగేశ్ఎన్నో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. 2021లో యోగేష్ 9 బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బాడీబిల్డింగ్‌లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డు సైతం గెలుపొందాడు. 2021లో వైష్ణవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది.
వివాహం అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు యోగేశ్ విరామం ప్రకటించాడు. ప్రస్తుతం ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటూర్ బస్స్టేషన్సమీపంలోని జిమ్‌కు వెళ్లి అక్కడి యువకులకు శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్ బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికీ యోగేష్ బాత్‌రూం నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి యువకులు బాత్‌రూం తలుపుకు పగలగొట్టి చూడగా యోగేష్ కిందపడి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే యువకులు అతడిని స్థానికంగా ఉన్న కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి హూటాహుటిన తరలించగా యోగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. గుండెపోటు రావడంతోనే యోగేష్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కొంతకాలంగా పోటీలకు దూరంగా ఉంటోన్న యోగేష్ ఒక్కసారిగా భారీ బరువులు మోయడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు అంటున్నారు.
యోగేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే యోగేష్.. ఈ విధంగా చనిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.