డీకే శివకుమార్ నివాసంపై సీబీఐ ఆకస్మిక దాడులు
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నివాసంపై ఈ తెల్లవారుజామున సీబీఐ ఆకస్మికంగా దాడులు చేసింది. ఆయనతో పాటు సోదరుడు సురేష్ నివాసంలోనూ..;
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నివాసంపై ఈ తెల్లవారుజామున సీబీఐ ఆకస్మికంగా దాడులు చేసింది. ఆయనతో పాటు సోదరుడు సురేష్ నివాసంలోనూ. తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లు, మనీలాండరింగ్ కేసులో గతంలో డికే శివకుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలో.... ఈ దాడులు జరుగుతున్నట్టులు తెలుస్తోంది. మొత్తం 14 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు చేస్తోంది.
సిరా, రాజారాజేశ్వర్‌నగర్ స్థానాలకు... ఉపఎన్నికలు జరుగుతున్న వేళ... డీకే సోదరుల ఇళ్లలో సీబీఐ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షుడుగా శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో... ఆయన దీనిని సవాల్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ దాడులు జరుగుతుండటంతో... కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.
డీకే సోదరుల ఇళ్లలో సీబీఐ దాడులపై... కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. అటు ఆ రాష్ట్రమాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష రాజకీయాలతో బీజేపీ... ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. ప్రస్తుత ఉపఎన్నికలపై ప్రభావం చూపేందుకే... కేంద్రం.. సీబీఐతో దాడులు చేయిస్తోందంటు మండిపడ్డారు.
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆదాయపన్ను శాఖ పైల్ చేసిన ఛార్జీషీట్ ఆధారంగా.. ఈడీ కేసు నమోదు చేసి అదుపులో తీసుకుంది. 50 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో.. ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీహైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.