Ration Cards: భారీగా రేషన్ కార్డులు రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ation Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డుల గుర్తింపు;

Update: 2024-11-21 05:30 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకానికి అర్హులు కావాలన్నా.. వాటికి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు చాలా ముఖ్యం. అలాంటి రేషన్ కార్డు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు.. జాప్యం చేస్తున్న వేళ.. ఉన్న రేషన్ కార్డు దారులకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియలో భాగంగా భారీగా రేషన్ కార్డులను రద్దు చేస్తోంది. ఓ వైపు రేషన్ కార్డులను డిజిటలీకరణ చేస్తూనే.. మరోవైపు.. ఫేక్ రేషన్ కార్డులను ఏరివేసే ప్రక్రియను ముమ్మరంగా సాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 5.8 కోట్ల ఫేక్ రేషన్ కార్డులను రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

రేషన్ కార్డులను డిజిటలైజేషన్‌ చేయడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల ఆహార భద్రతలో ప్రపంచానికే భారత్ బెంచ్‌ మార్కును నమోదు చేసిందని తెలిపింది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్న భారతదేశంలో మొత్తం 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొంది. ఆధార్‌ కార్డు ధ్రువీకరణ, ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ ద్వారా నకిలీ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను తొలగించినట్లు వెల్లడించింది.

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్‌ కార్డులను డిజిటలైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాలకు ఈ-పోస్‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వీటి ద్వారా దేశంలోని 99.8 శాతం రేషన్ కార్డులను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేశామని.. ఇందులో 98.7 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తైనట్లు తెలిపింది. మరోవైపు ఈ - కేవైసీ ప్రక్రియతో ఇప్పటివరకు 64 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పూర్తయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News