Cholera Outbreak: నేపాల్ బిర్‌గుంజ్‌లో కలరా వ్యాప్తి..
ముగ్గురు మృతి, ఆస్పత్రిలో 300 మంది;
నేపాల్‌లోని పార్సా జిల్లాలో కలరా వ్యాధి వ్యాపిస్తున్నది. వారం నుంచి ఆ కేసులు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. సుమారు 300 మంది అతిసారంతో అస్పత్రి పాలయ్యారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. శుక్రవారం నుంచి బిర్‌కుంజ్ మెట్రోపాలిటన్ సిటీ ఆస్పత్రిలో డయేరియా వ్యాధి లక్షణాలతో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ర్యాపిడ్ టెస్టుల ద్వారా కలరా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
యాంటీజెన్ పరీక్షలో విబ్రియో కలరా 01 పాజిటివ్‌గా వస్తున్నారు. కాఠ్మాండులోని సెంట్రల్ ల్యాబ్ కూడా ఈ వ్యాధిని ద్రువీకరించింది. కలరాకు చెందిన సీరో టైప్ బ్యాక్టీరియా వల్ల బంగ్లాదేశ్‌లోనూ తీవ్ర స్థాయి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు బిర్‌గుంజ్ ఆస్పత్రి డాక్టర్లు అంచనా వేశారు. బిర్‌గుంజ్‌లోని కొన్ని వార్డుల్లో కేసులు అధికంగా ఉన్నాయి. కొందరు కిడ్నీ సంబంధిత వ్యాధికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
కలరా వ్యాధి వల్ల వాంతులు, విరోచనాలు వస్తుంటాయి. దీని వల్ల డిహైడ్రేషన్ అవుతుంది. ఒకవేళ తక్షణమే చికిత్స చేయకుంటే, దాని వల్ల ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 2009లో చివరిసారి నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో కలరా మహమ్మారి సోకింది. అప్పట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ 16 ఏళ్లకు కలరా వ్యాపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.