Commercial LPG Cylinder : పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
రెండు నెలల్లో రెండోసారి పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు.. హైదరాబాద్ లోనే అత్యధికం;
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచడంతో హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలు, మహానగరాల్లో ధరలు మరింతగా పెరిగాయి. గడిచిన రెండు నెలల్లో రెండోసారి పెరిగిన ఈ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని భారతీయ మెట్రోలలో కన్నా వాణిజ్య LPG సిలిండర్ల ధర హైదరాబాద్‌లో అత్యధికంగా ఉంది.
ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు రూ. 103 పెరిగిన తరువాత, హైదరాబాద్ నగరంలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2059.50గా ఉంది. చెన్నై సిలిండర్‌కు రూ. 1999.50 వద్ద రెండవ అత్యధిక ధరను కలిగి ఉంది.
మెట్రో నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
హైదరాబాద్ - 2059.50 (+103)
కోల్‌కతా - 2103 (+103)
చెన్నై - 1999.50 (+101.50)
బెంగళూరు - 1914 (+101.50)
ఢిల్లీ - 1833 (+101.50)
మెట్రోలలో డొమెస్టిక్ సిలిండర్ ధరలు
దేశీయ LPG ధరలు మారనప్పటికీ, హైదరాబాద్‌లో సిలిండర్ ధర భారతీయ మెట్రోలలో అత్యధికంగా ఉంది.
హైదరాబాద్‌లో డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ. 955. కోల్‌కతా సిలిండర్‌కు రూ. 929 వద్ద రెండవ అత్యధిక ధరను కలిగి ఉంది.
మెట్రో నగరాల్లో డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
హైదరాబాద్ - రూ. 955
కోల్‌కతా - రూ.929
చెన్నై - రూ. 908.5
బెంగళూరు - రూ. 905.5
ఢిల్లీ - రూ. 903
హైదరాబాద్‌లోనే ఎందుకు ఎక్కువ అంటే...
వివిధ రాష్ట్రాల, నగర పన్నుల కారణంగా హైదరాబాద్‌లో ఎల్‌పిజి సిలిండర్ ధరలు మెట్రోలలో అత్యధికంగా ఉన్నాయి. స్థానిక పన్నుల కారణంగా హైదరాబాద్ వాసులు అధిక ధరలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గ్యాస్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. జిల్లాలో వాణిజ్య, గృహ గ్యాస్ ధరలు వరుసగా రూ.2101, రూ.980గా ఉన్నాయి.