Narendra Modi: వయనాడ్‌లో ఓటమి భయంతో రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీ
భాగ్ రాహుల్ భాగ్ అంటున్న బిజెపి;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్‌బరేలీకి మారడంపై భాజపా విమర్శల దాడి చేసింది. వయనాడ్‌లో ఓటమి భయంతోనే రాయ్‌బరేలీలో పోటీకి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. వయనాడ్ ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. రాహుల్ రెండోచోట పోటీ చేయటంపైవయనాడ్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...బరిలో నిలవడంపై భాజపా నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమేఠీ నుంచి భయపడి రాయ్‌బరేలీకి పారిపోయారని...విమర్శించారు. కేరళలోని వయనాడ్‌లో ఓడిపోతాననే తెలిసే...కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీని రాహుల్ ఎంచుకున్నారని విమర్శించారు. రెండుస్థానాల నుంచి పోటీ చేయాలని...రాహుల్ నిర్ణయించుకోవడం ద్వారా వయనాడ్ ప్రజలకు ద్రోహంచేశారని కమలనాథులు మండిపడ్డారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓడిపోయిన అమేఠీ నుంచి ఈసారి బరిలో నిలవకపోవడంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్...విరుచుకుపడ్డారు. యుద్ధభూమి నుంచి పారిపోయిన వ్యక్తి....దేశానికి నాయకత్వం వహించాలని ఎలా అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌కు అమేఠీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ అమేఠీ నుంచి పోటీ చేయాలని కోరుకుంటే ఆయన మాత్రం..పారిపోయాడని రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే రాహుల్ రెండోస్థానం ఎంచుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. రాహుల్ బాబాను సోనియా 20సార్లు లాంఛ్ చేసిన విజయవంతం కాలేదని... ఇప్పుడు ఇరవై ఒకటోసారి లాంఛ్ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు..
రాహుల్ గాంధీ ఓ రాజకీయ పర్యాటకుడని...మహారాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అభివర్ణించారు. రాహుల్ ఎక్కడికి వెళ్లినా ఓటమి ఖాయమని.... కేంద్రమంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. గాంధీ-నెహ్రూ కుటుంబం...ప్రజలకు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించుకోక తప్పందన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని పీయూష్ గోయల్ అన్నారు. రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా ద్రోహం చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చారని...భాజపా అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్ ఆరోపించారు. అమేఠి ప్రజలపై నమ్మకం లేకనే...రాయ్‌బరేలీకి రాహుల్ పారిపోయాడని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ....ఎద్దేవా చేశారు.
అటు రాయ్‌బరేలీలోనూ రాహుల్ పోటీ చేయటంపై కేరళలోని వాయనాడ్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రాహుల్ మరోచోట పోటీ చేయడంలో తప్పులేదని... కొందరన్నారు. అయితే రెండు స్థానాల్లో గెలిస్తే, వయనాడ్ సీటు ఖాళీ చేసే...అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. రాహుల్ అలా చేసిన పక్షంలో... తమకు మంచిదికాదన్నారు.