Bharat Jodo Yatra : కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'.. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు..
Bharat Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తపిస్తోంది. ఇందుకోసం భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది.;
Bharat Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తపిస్తోంది. ఇందుకోసం భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై కాశ్మీర్‌లో ముగియనుంది.12 రాష్ట్రాల మీదుగా 3,500 కిలోమీటర్ల దూరం కొన సాగే భారత్ జోడో యాత్ర పూర్తి కావడానికి 150 రోజులు పడుతుంది.
భారత్ జోడో యాత్రలో.... రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలంతా పాల్గొంటారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం.. సర్వ ధర్మ సంభవను విశ్వసించే ప్రజలందరినీ ఏకం చేయాలన్నలక్ష్యంతోనే ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ జోడో రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. దీనికి ఆర్గనైజింగ్ కమిటీకి దిగ్విజయ్ సింగ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.