Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాక శోభితమైన జమ్ముకశ్మీర్
సీఆర్‌పీఎఫ్ బలగాల బైక్ ర్యాలీ....లాల్ చౌక్ నుంచి దాల్ వరకు సాగిన ర్యాలీ..;
స్వాతంత్ర్య దినోత్సవ వేళ జమ్మూకశ్మీర్(jammu kashmir) త్రివర్ణ పతాక శోభితమైంది. శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్(crpf) జవాన్లు మువ్వన్నెల జెండాలతో భారీ బైక్ ర్యాలీ(bike rally) నిర్వహించారు. లాల్ చౌక్ నుంచి దాల్ లేక్ ఒడ్డున నిషాత్ బాగ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వందలాది జవాన్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. కశ్మీర్ లో ప్రజలు శాంతియుత జీవనాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నారని భద్రతా బలగాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్ లోయలో రాళ్లదాడి శకం ముగింపు దశలో ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి అల్లర్లు రేపేందుకు నిధులు వెచ్చించే సంస్థలన్నీ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుపోయాయని CRPF అధికారులు తెలిపారు.