ఢిల్లీ ట్రాఫిక్ నియంత్రణకు AI వినియోగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది;
ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సులువుగా చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురానుంది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. వాహన రద్దీని తగ్గించడంతోపాటు వాహనాలు వేగంగా, సులువుగా కదిలేందుకు ఇది దోహదపడుతుంది.
2024 చివరి నాటికి ఈ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఐటీఎంఎస్ సాంకేతికత అనేది కృత్రిమ మేధ ఉపయోగించి వాస్తవికంగా ట్రాఫిక్ ఏవిధంగా ఉందో అన్న విషయాన్ని అంచనా వేస్తుంది. దీని అమలు తర్వాత నగరంలో ట్రాఫిక్ పరిస్థితి తీరు మారుతుంది. ట్రాఫిక్‌కు సంబంధించి ఎప్పటికప్పటి సమాచారాన్ని వాహనదారులకు చేరవేస్తుంది. వాహనాల రద్దీ, వాటి సరాసరి వేగం వంటి అంశాల ఆధారంగా పగటి సమయాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ స్వయంగా నిర్వహించుకుంటుంది.