కేంద్రంతో డిఎంకె పోరాటం.. కరెన్సీ చిహ్నాన్ని మార్చిన స్టాలిన్ ప్రభుత్వం..
కొత్త జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ద్వారా హిందీని 'విధించడం'పై కేంద్రంతో డిఎంకె పోరాటం చేస్తున్న నేపథ్యంలో కరెన్సీ చిహ్నాన్ని మార్చుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ఱయించుకుంది.;
కొత్త జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ద్వారా హిందీని 'విధించడం'పై కేంద్రంతో డిఎంకె పోరాటం చేస్తున్న నేపథ్యంలో కరెన్సీ చిహ్నాన్ని మార్చుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ఱయించుకుంది.
గురువారం నాడు 2025/26 రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి గుర్తు (Re) స్థానంలో తమిళ అక్షరం (Ru) ను ఉంచింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త లోగోను X లో షేర్ చేసిన తర్వాత ఈ మార్పు హైలైట్ అయింది.
కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బిజెపి నేతృత్వంలోని కేంద్రంతో అధికార డిఎంకె పోరాటం చేస్తున్న నేపథ్యంలో కరెన్సీ చిహ్నాన్ని మార్చుకోవాలనే నిర్ణయం తీసుకుంది స్టాలిన్ ప్రభుత్వం. అయితే ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక నోటీసు రాలేదు.
అయితే, డీఎంకే నాయకుడు శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ "ఇందులో చట్టవిరుద్ధం ఏమీ లేదు... మేము తమిళానికి ప్రాధాన్యత ఇస్తాము... అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
మూడు భాషల సూత్రానికి మద్దతు కూడగట్టడానికి రాష్ట్రంలో ఇంటింటి ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె అన్నామలై, ఈ మార్పిడిని "మూర్ఖత్వం" అని కొట్టి పడేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రం ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గుర్తుల మార్పిడి చోటు చేసుకుంది. తమిళనాడులో ఎప్పుడూ రాజకీయంగా పట్టు సాధించని BJP కి ఇది ఒక మింగుడు పడని వ్యవహారంగా మారింది.
తమిళనాడు ప్రభుత్వం మూడవ భాష నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ప్రస్తుతం ఉన్న రెండు భాషల విధానంలో విద్యార్థులకు తమిళం మరియు ఇంగ్లీష్ నేర్పుతారు. మూడవ భాషగా విద్యార్థులకు హిందీ నేర్పించాలని బీజేపీ పట్టుబడుతోంది.
గత నెలలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే ఎన్నికలను ప్రస్తావిస్తూ, DMK "రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కథనాన్ని" సృష్టిస్తోందని ఆరోపించారు.
శ్రీ ప్రధాన్ మరియు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదునైన దాడులు మరియు ప్రతిదాడులు చేసుకున్నారు. తమిళనాడు త్రిభాషా విధానాన్ని పూర్తిగా అమలు చేయకపోతే రూ.2,150 కోట్ల నిధులు నిలిపివేయబడతాయని శ్రీ ప్రధాన్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఆయనకు లేఖ రాశారు.
ఈ విధానం తమిళనాడు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి మేము దీనిని వ్యతిరేకిస్తున్నాము" అని డిఎంకె అధినేత తిరువళ్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.