Flight Ticket Prize Hike: మోతెక్కిపోతోన్న డొమెస్టిక్ ఫ్లైట్ చార్జీలు..
దీపావళి సీజన్‌లో టికెట్ ధరలను భారీగా పెంచేసిన సంస్థలు;
విమాన చార్జీలకు రెక్కలు వచ్చాయి.డొమెస్టిక్ చార్జీలు మోత మోగిపోతోన్నాయి.దీపావళి సీజన్‌లో టికెట్ ధరలను భారీగా పెంచేశాయి విమాన సంస్థలు. కీలక రూట్లలో 89 శాతం వరకు పెంచేశారు.లిమిటెడ్ కెపాసిటీ..హై డిమాండ్‌తో విమాన చార్జీల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఢిల్లీ-శ్రీనగర్ రూట్‌లో ఏకంగా 89శాతం ధరలు పెరిగాయి. టూరిస్టులు దీపావళికి హాలీడే ట్రిప్పులు ప్లాన్ చేసుకోవడంతో డిమాండ్‌ను అందిపుచ్చుకుంటున్నాయి విమాన సంస్థలు.
ఈ దీపావళి సీజన్‌లో కొన్ని రూట్లలో విమాన ప్రయాణానికి టికెట్ ధరలు ఆకాశాన్ని చేరాయి. వరుస సెలవులు రావడంతో చాలా మంది హాలీడే ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రధాన నగరాల నుంచి పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లే విమానాల టికెట్ల ధరలన్నీ భారీగా పెరిగిపోయాయి. యి. దేశీయ పర్యటనలు కాకుండా విదేశీ పర్యటనలు బెటరనుకుంటున్నారు జనం.విమాన చార్జీలతో హడలిపోతున్నారు జనం. తక్కువ సమయంలో ఎక్కవ ఉపయోగకరంగా మారడంతో ఇటీవలి కాలంలో మధ్యతరగతి వర్గం విమాన ప్రయాణాలవైపు మొగ్గుచూపుతోంది. ఆయితే ఆ సంబరం ఎంతో సేపు నిలవలేదు. ఇప్పుడు విమాన ధరలు చుక్కలనంటుతున్నాయి. గగనతలంలోకి ఎగరాలంటే వేలుకుమ్మరించక తప్పని పరిస్థితి ప్రయాణికులను హడలెత్తిస్తోంది. మొదట్లో ఫరవాలేదనిపించిన విమాన చార్జీలు…చూస్తుండగానే చుక్కలనంటేస్తున్నాయి.ఒక్కరోజో, రెండ్రోజుల ముందు టికెట్ బుక్ చేస్తే మూడింతలు పెరిగిపోవడం ఖాయం. డైనమిక్ ప్రైసింగ్ తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా రూట్ల ధరలు పెంచుతున్నాయి విమానయాన సంస్థలు.
జెట్ ఎయిర్‌వేస్ గో ఫస్ట్ లాంటి విమాన సంస్థలు మూత పడడం… స్పైస్ జెట్ ఫ్లైట్‌లలో కొన్ని ఫ్లైట్లను గ్రౌండ్ చెయ్యడంతో మిగిలిన విమాన సంస్థలు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. మరోవైపు క్రూడ్ ధరలు తగ్గుతున్నా చార్జీలు మాత్రం తగ్గని పరిస్థితి దేశీయ ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది. గంటకు నిర్ణీత ధర అంటూ ప్రభుత్వం ఒక టారిఫ్ ను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా విమానయాన సంస్థలను కాపాడి ప్రయాణికులకు లాభం చేకూర్చవచ్చని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు.