EPFO Good News : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఆటో క్లెయిమ్ పరిధి 5లక్షలకు పెంపు
దేశంలో 7.5 క ఓట్ల మంది సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్ యాక్సెస్ ను మరింత సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఎ) అడ్వాన్స్డ్ క్లెయిమ్ సిస్టమ్ కింద ఆటో సెటిల్మెంట్ పరిమితిని లక్ష నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. ఆర్ధిక సంవత్సరం 2024-25లో మార్చి 6 నాటికి ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో 2.16 కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లను నమోదు చేసింది. ఇది 2023-24లో నమోదు చేసిన 89.52 లక్షలతో పోల్చితే భారీ పెరుగుదలను నమోదు చేసింది. తిరస్కరణ రేటు కూడా 50 నుంచి 30 శాతానికి తగ్గినట్లు ఈపీఎఫ్ఎ తెలిపింది. లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో శ్రీనగర్ లో జరిగిన ఈపీఎఫ్ఓ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఆమోదించారు. ఆటో మోడ్ సదుపాయాన్ని 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభించారు. 3034 మేలో ఈ పరిమితిని 50 వేల నుంచి లక్షరూపాయలకు, తాజాగా దీన్ని 5 లక్షలకు పెంచారు.