Buddhadeb Bhattacharya | మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమం
ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు... వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స;
పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి(Former West Bengal CM) బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆలీపోర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి(hospitalised )కి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని(critical health condition), వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన కండీషన్ విషమంగా ఉందని, ఆక్సిజన్ స్థాయిలు 70కి పడిపోయాయని, ఆయన సృహలో లేరని, అనంతరం ఆస్పత్రికి తీసుకువచ్చారని.. చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు.
79 ఏళ్ల భట్టాచార్య కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఊపిరి ఆడాలంటే నెబ్యులైజర్ సపోర్టు తప్పని సరి, అయితే కొన్ని రోజులుగా నెబ్యులైజర్ ఉపయోగించినా ఊపిరి ఆడటం చాలా కష్టంగా మారినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించారు.
భట్టాచార్య రక్తంలో ఆక్సిజన్ స్థాయులు అనూహ్యంగా పడిపోయినట్లు తెలుస్తోంది. రక్తపోటు కూడా నియంత్రణలో లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారని, కొన్ని గంటలు గడిచే వరకు ఎలాంటి ప్రకటన చేయలేమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
భట్టాచార్య ఆరోగ్యంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆనంద్‌బోస్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి భట్టాచార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.
లోయర్ రెస్పిరేటర్ ట్రాక్ ఇన్పెక్షన్, టైప్-2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు శనివారం సాయంత్రం విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో వైద్యులు తెలిపారు. నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ సపోర్ట్, యాంటిబయోటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రక్తప్రసరణ, హార్డ్ రేట్ నిలకడగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. మెడిసన్, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మనాలజీ, ఇంటర్నల్ మెడిసన్, అనస్థియాలజీలో నిపుణులైన తొమ్మిది మంది వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య పని చేశారు. CP(I)M పాలిటీబ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఆయన 2015లో తప్పుకున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి 2018లో తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాటార్య ఆస్పత్రికి వచ్చారు.