Girlfriend : ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు..
చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలైన ప్రేయసి;
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, పెంచిన పిల్లలను చంపేస్తున్న ఈ కాలంలో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం దొంగగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడికి బైక్ కొనాలనే ఉద్దేశ్యంతో పట్టపగలు దొంగతనం చేసి ప్రియురాలు పట్టుబడింది. ప్రియుడితో కలిసి తన బంధువుల ఇంట్లో నగదు, నగలు సహా సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులను దొంగిలించింది.
నేరాన్ని దాచలేక నిజాన్ని
దొంగతనమైతే దైర్యంగా చేశారు కానీ పోలీసుల ముందు తడబడి నేరాన్ని దాచలేక నిజాన్ని ఒప్పుకున్నారు. ఆరేళ్లుగా లవ్ లో వీరిద్దరని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం కన్హయ్య పటేల్ కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌కు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగిలిపోయి ఉంది. రెండు పెట్టెల్లోంచి రూ.95 వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఆగస్టు 9వ తేదీన హల్బా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో గ్రామానికి చెందిన 22 ఏళ్ల కరుణ పటేల్, ఆమె 24 ఏళ్ల ప్రియుడు తమర్ధవాజ్ విశ్వకర్మ సంఘటన జరిగిన రోజున అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు.
బైక్ కొనడానికి డబ్బు అవసరమని
వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కరుణ తన ప్రియుడికి బైక్ కొనడానికి డబ్బు అవసరమని అందుకే ఇద్దరూ దొంగతనం ప్లాన్ చేశామని ఒప్పుకుంది. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కరుణ తర బంధువు ఇంటి తాళం పగలగొట్టి అందులో నుంచి నగదు, నగలు దొంగిలించింది. ఆమె ప్రియుడు తామ్రధ్వజ్ విశ్వకర్మ బయట ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నాడు. దొంగిలించిన నగదును కరుణ ప్రేమికుడికి ఇచ్చి, ఆ నగలను మాత్రం తన వద్దే ఉంచుకుంది.ఇద్దరూ నేరం అంగీకరించారని, దొంగిలించబడిన వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సిన్హా తెలిపారు.
నగలు, డబ్బు స్వాధీనం
'ఆ అమ్మాయి దొంగిలించి ఇచ్చిన రూ.95వేల నగదును నిందితుడు తామ్రధ్వజ్ విశ్వకర్మ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నాం. తరువాత నిందితురాలు కరుణ పటేల్ చోరీ చేసిన రూ.2 లక్షల విలువైన అభరణాలను కూడా రికవరీ చేశాం' అని కాంకేర్ అదనపు ఎస్పీ దినేశ్ సిన్హా తెలిపారు. ప్రియుడి కోసం యువతి దొంగగా మారడంతో, స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు నిందితులు ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు తరలించారు.