తన కూతురికి టీచర్ బలవంతంగా గుడ్డు తినిపించిందని తండ్రి ఫిర్యాదు.. స్పందించిన ప్రభుత్వం

పాఠశాల ఉపాధ్యాయురాలు తమ "మతపరమైన మనోభావాలను" దెబ్బతీసిందని పేర్కొంటూ బ్రాహ్మణ వర్గానికి చెందిన 2వ తరగతి విద్యార్థి తండ్రి విద్యాశాఖకు లేఖ రాశారు.

Update: 2023-11-24 08:29 GMT

పాఠశాల ఉపాధ్యాయురాలు తమ "మతపరమైన మనోభావాలను" దెబ్బతీసిందని పేర్కొంటూ బ్రాహ్మణ వర్గానికి చెందిన 2వ తరగతి విద్యార్థి తండ్రి విద్యాశాఖకు లేఖ రాశారు.

కర్ణాటక శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థినికి ఆమె టీచర్ బలవంతంగా గుడ్లు తినిపించారనే ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సంబంధిత ఉపాధ్యాయుడిపైనా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తాము శాకాహారం పాటిస్తున్నామని ఆ విషయం గతంలో పాఠశాల అధికారులకు తెలియజేశామని విద్యార్థి తండ్రి తన ఫిర్యాదులో తెలిపారు.

ఈ విషయం తెలిసినా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో టీచర్ తన కూతురికి బలవంతంగా గుడ్డు తినిపించిందని ఆరోపించారు. విచారణలో భాగంగా గురువారం మండల విద్యాశాఖాధికారి, మధ్యాహ్న భోజన అటెండర్ పాఠశాలను సందర్శించారు.

ప్రాథమిక విచారణలో, మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నప్పుడు విద్యార్థుల బృందం భోజనం కోసం వరుసలో కూర్చున్నారు. అప్పుడే ఓ ఉపాధ్యాయురాలు గుడ్డు ఇష్టపడే విద్యార్థులను చేతులు ఎత్తమని అడిగారు. ఇతర పిల్లలతో సహా ఈ చిన్నారి కూడా చేయి ఎత్తింది. అందరూ చేతులు ఎత్తారని తాను కూడా ఎత్తిందో, లేదా గుడ్డు తినాలనిపించిందేమో అందుకే మేము కూడా ఆలోచించకుండా వడ్డించాము. అంతేకానీ ఏ విద్యార్థులనూ గుడ్లు తినమని బలవంతం చేయలేదు, ”అని విద్యా శాఖ సీనియర్ అధికారికి పాఠశాల ఉపాధ్యాయురాలు తెలిపింది.

పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (శివమొగ్గ) డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరప్ప మాట్లాడుతూ.. "మేము సమస్యను చాలా సీరియస్‌గా తీసుకున్నాము. అయితే మాకు అందిన సమాచారం ఆధారంగా, విద్యార్థికి బలవంతంగా గుడ్డు తినిపించలేదు అని తెలిసింది. అయితే, నివేదికను పరిశీలించిన మీదట బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా మరియు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత ఉపాధ్యాయుడిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు

Tags:    

Similar News