Gujarath: అంబానీ కుటుంబం ఆహ్వానం.. గుజరాత్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్..

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీ వంటారా వన్యప్రాణుల కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉదయపూర్ వెళ్లారు.

Update: 2025-11-21 07:02 GMT

అంబానీ కుటుంబ అతిథిగా గుజరాత్‌ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ జూనియర్ గురువారం జామ్‌నగర్ వన్యప్రాణుల అభయారణ్యం, స్థానిక దేవాలయాలను సందర్శించారు. అనంతరం అనంత్ అంబానీ కుటుంబంతో కలిసి దాండియా ఆడారు. 

ట్రంప్ జూనియర్ అనంత్ అంబానీ పర్యవేక్షణలో నిర్మించిన విశాలమైన రెస్క్యూ పునరావాస ప్రాజెక్ట్ అయిన వంటారాను సందర్శించారు. రిలయన్స్  దాతృత్వ కార్యక్రమాలలో ఒకటిగా మారిన వన్యప్రాణుల పరిరక్షణ గురించి వివరించారు.

అక్కడి నుండి, అతను క్యాంపస్ సమీపంలోని దేవాలయాలను సందర్శించారు. గణపతి మందిరం మరియు ఇతర దేవాలయాలను సందర్శించారు. 

దేవాలయానికి వచ్చిన సందర్శకులు ఆయన భార్య వెనెస్సా ట్రంప్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లతో కలిసి దాండియా ఆడుతున్న దృశ్యాలను వీక్షించారు. 

ఆగ్రాలో  తాజ్ మహల్‌ను వీక్షించిన జూనియర్ ట్రంప్ దానిని "ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో ఒకటి" అని అభివర్ణించారు. తదుపరి విమానంలో ఆయన ఉదయపూర్‌కు వెళ్లి, అక్కడ ఒక భారతీయ-అమెరికన్ జంట వివాహ వేడుకలకు హాజరవుతారని సమాచారం. ఆత్మీయ స్వాగతం పలికినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏప్రిల్‌లో, US ఉపాధ్యక్షుడు JD వాన్స్ తన కుటుంబంతో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించారు, దీనిని "అందమైన చారిత్రాత్మక ప్రదేశం" అని అభివర్ణించారు.

Tags:    

Similar News