ఓటింగ్ రోజే గుండెపోటుతో మృతి చెందిన ఎమ్మెల్యే
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన స్వతంత్ర రాకేశ్ దౌల్తాబాద్ కన్నుమూశారు.;
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన స్వతంత్ర రాకేశ్ దౌల్తాబాద్ కన్నుమూశారు. ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. గుండెపోటు రావడంతో అడ్మిట్ చేసినా కాపాడలేకపోయారు.
హర్యానాలో 2024 లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మృతి చెందారు. మరణించిన ఎమ్మెల్యే పేరు రాకేష్ దౌల్తాబాద్, గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. గురుగ్రామ్‌లోని పాలమ్ విహార్ మణిపాల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు.