Hemant Soren : కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్..
Hemant Soren : జార్ఖండ్ సీఎం సోరేన్ కూడా కేజ్రీవాల్ రూట్‌నే ఎంచుకున్నారు.;
Hemant Soren : జార్ఖండ్ సీఎం సోరేన్ కూడా కేజ్రీవాల్ రూట్‌నే ఎంచుకున్నారు. తన ప్రభుత్వానికి ఎదురులేదని అసెంబ్లీ సాక్షిగా నిరూపించేందుకు విశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్షకు రెడీ అవుతున్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు.
82 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఏంఎం కూటమికి 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అవినీతి ఆరోపణలతో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ విశ్వాసపరీక్ష నెగ్గితే మరో ఆరు నెలల పాటు ప్రభుత్వానికి ఢోకాలేదని సోరేన్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.
నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌కు సూచించింది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ రేపుతున్న సమయంలో సోరెన్ విశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.