Himachal Pradesh: హిమాచల్ ముఖ్యమంత్రి, మంత్రులు సంచలన నిర్ణయం..

రెండు నెలలు వేతనాలు తీసుకోవద్దని నిర్ణయించినట్లు సీఎం ప్రకటన;

Update: 2024-08-30 02:15 GMT

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్‌ అల్లకల్లోలంగా మారింది. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు వేతనాలు తీసుకోవద్దని కేబినెట్ నిర్ణయించింది. చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా వేతనాలకు దూరంగా ఉండనున్నారు.

ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సఖు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ గల్లంతైంది. జూన్ 27 నుంచి ఆగస్ట్ 9 మధ్యలో 100 మంది మృతి చెందారు. బ్రిడ్జిలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. విపత్తు అనంతరం పునర్నిర్మాణం కింద రూ. 9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, మంత్రులు, ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో సీఎం, మంత్రులు మాత్రమే కాకుండా చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు 2 నెలల జీతాలతోపాటు అలవెన్సులు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు.. గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇదే సమయంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర అల్లకల్లోలంగా మారింది. ఆగస్ట్ నెలలో కులు, మండి, సిమ్లా జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా భారీగా సంభవించిన వరదల్లో సుమారు 30 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరి పలువురి ఆచూకీ గల్లంతైంది. జూన్‌ 27వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ మధ్యలో ఏకంగా 100 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రిడ్జ్‌లు, రోడ్లు, సహా పలు నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఓ వైపు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతోపాటు పర్యాటకంపై ప్రభావం పడింది.

Tags:    

Similar News