MANIPUR TERROR: నిందితుడి ఇల్లు తగలబెట్టేశారు.. కుటుంబాన్ని వెలేశారు

మణిపుర్‌ నగ్న ఘటనలో ప్రధాన నిందితుడి ఇళ్లు తగలబెట్టిన ప్రజలు... కుటుంబాన్ని వెలేస్తున్నట్లు ప్రకటన;

Update: 2023-07-21 05:15 GMT

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా‍(Manipur women naked) మార్చేసి రాక్షసానందం పొందిన ఘటనపై యావత్‌ దేశం రగిలిపోతోంది. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ అమానవీయ ఘటనపై నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించినా ప్రజాగ్రహం చల్లారడం లేదు.


ఈ దారుణంలో ప్రధాన నిందితుడి(main accused)గా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌(Huirem Herodas) ఇంటిని కొందరు తగులబెట్టారు(burnt). పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్‌ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు(miscreants).. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారని పోలీసులు తెలిపారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి.

మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హుయిరేమ్‌ కనిపించాడు. అయితే అప్పటికే వీడియో వైరల్‌ కావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు.


బుధవారం రాత్రి థౌబల్‌ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అకృత్యానికి సంబంధించి మరో ముగ్గురినీ సైతం అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితులను కూడా పట్టుకునే పనిలో మణిపుర్‌ పోలీసులు ఉన్నారు. 

Tags:    

Similar News