PASSPORT RULES: పాస్‌పోర్ట్ దరఖాస్తుకు కొత్త రూల్స్ ఇవే!
జనన ధ్రువీకరణ తప్పనిసరి... ఇంకేం సర్టిఫికేట్స్ కావాలంటే..;
పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి ఐడెంటిటీని వెరిఫై చేసే కీలక డాక్యుమెంట్. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే సమయంలో తప్పకుండా పాస్‌పోర్టు ఉండాలి. ప్రయాణికుడి నేషనాలిటీ, ఇతర కీలక వివరాలను ఇది నిర్ధారిస్తుంది. ప్రతి ఏడాది ఎంతోమంది భారతీయులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే, భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌ను సింపుల్, సేఫ్‌గా మార్చడానికి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో కొత్త ప్రూఫ్ ఆఫ్ బర్త్ రిక్వైర్‌మెంట్స్, పాస్‌పోర్ట్ డిజైన్ అప్‌డేట్స్, పాస్‌పోర్ట్ సర్వీస్ సెంటర్ల ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి.
వారికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి
2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌గా.. బర్త్ సర్టిఫికేట్‌ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సర్టిఫికేట్‌ను మున్సిపల్ కార్పొరేషన్, జనన మరణాల రిజిస్ట్రార్ లేదా జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం, 1969 కింద ఇతర అధికారులు జారీ చేయాలి. డాక్యుమెంట్స్‌ను స్టాండర్డైజ్ చేయడం, ఏజ్ వెరిఫికేషన్‌లో లోపాలను నివారించడం లక్ష్యంగా ఈ రూల్ తీసుకొచ్చారు. అయితే, 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారికి పాత రూల్స్ వర్తిస్తాయి. వారు ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లు, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్లు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేదా సర్వీస్ రికార్డ్ ఎక్స్‌ట్రాక్ట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయవచ్చు.
సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లు
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అడ్రస్ ఇకపై పాస్‌పోర్ట్ చివరి పేజీలో ప్రింట్ చేయరు. దీనికి బదులుగా స్కాన్ చేయగల బార్‌కోడ్‌లో స్టోర్ చేస్తారు. పర్సనల్ డీటైల్స్ మిస్‌యూజ్ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారు. పాస్‌పోర్ట్ టైప్స్‌ని గుర్తించడానికి కొత్త సిస్టమ్‌లో కలర్స్ ఉపయోగిస్తారు. ప్రభుత్వ అధికారులకు వైట్, డిప్లమాట్స్‌కి రెడ్, సాధారణ పౌరులకు బ్లూ పాస్‌పార్ట్‌లు జారీ చేస్తారు. పాస్‌పోర్ట్ చివరి పేజీలో ఇకపై తల్లిదండ్రుల పేర్లు ఉండవు. ఇది సింగిల్-పేరెంట్ లేదా విడిపోయిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల ప్రైవసీని కాపాడుతుంది.
మరిన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
పాస్‌పోర్ట్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను 442 నుంచి 600కి పెంచాలని యోచిస్తోంది. ఈ విస్తరణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు పాస్‌పోర్ట్‌ల కోసం సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి సహాయపడుతుంది.