Virtual Reception: ఇండిగో విమానం రద్ధు..స్వంత రిసెప్షన్‌కు ఆన్‌లైన్‌లో హాజరైన జంట
రిసెప్షన్ పై ఎఫెక్ట్ చూపిన విమానాల రద్దు
ఇండిగో విమాన సర్వీసులలో ఇటీవల రెండు మూడు రోజులుగా ఏర్పడిన అంతరాయం తెలిసిందే. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 500 విమానాలు రద్దు అయ్యాయి. ఫలితంగా, ముందుగా షెడ్యూల్ చేసిన పణులను కూడా ప్రయాణికులు రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విమానాలు రద్దు కావడంతో ఓ జంట ఆన్ లైన్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
విమానాల రద్దు ప్రభావం రిసెప్షన్ పై పడింది. బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ మేధా క్షీరసాగర్ , సంగమ దాస్ నవంబర్ 23న భువనేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు మేధా కర్ణాటకలోని హుబ్బళ్లో ఉండడంతో వధువు స్వగ్రామంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిసెంబర్ 2న, భువనేశ్వర్ నుండి బెంగళూరుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు విమానం రావాల్సి ఉంది. అయినప్పటికి గంటల తరబడి విమానాశ్రయంలో వేచి ఉన్నారు. చివరికి విమానం రద్దు అయ్యింది. దీంతో చేసేదేమీ లేక హుబ్బళ్లో జరిగే తమ రిసెప్షన్‌కు వారు వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. బంధువులు ఫంక్షన్ హాల్‌లో ఉన్నప్పటికీ, వధూవరులు LED స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా కనిపించారు. ఫంక్షన్‌లో ఉన్న బంధువులను వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు వారు చాలా బాధపడారు.