Chattishgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కొన‌సాగుతున్న ఎదురుకాల్పులు.

మావోయిస్టు మృతి;

Update: 2025-05-23 07:00 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు‌తోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News