ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం మూడు పార్టీలు కలవడం అవసరం: పవన్ కళ్యాణ్

ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం మూడు పార్టీలు కలవడం అవసరమని అంటున్నారు.;

Update: 2023-07-19 05:08 GMT

ఎన్డీఏలోకి టిడిపి రావాలని అభిలషిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో ఉన్న ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. 

ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం మూడు పార్టీలు కలవడం అవసరమని అంటున్నారు. వైసిపి ఓటమికి మూడు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చాలా రోజుల నుంచి పవన్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు పలువురు కేంద్ర ప్రభుత్వం బిజెపి ముఖ్యలను కలిసే అవకాశం ఉంది. ఎన్డీఏ సమావేశాల్లో జాతీయ అంశాలు చర్చించామని, ఏపీ అంశాలపై ఇవాళ మాట్లాడుతానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడం తదితర అంశాలపై కేంద్ర బిజెపి ముఖ్యులతో పవన్ చర్చించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News