Jharkhand Exit Poll 2024 : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. గెలిచేది ఆ కూటమేనా ?
కాంగ్రెస్ కూటమి 40 సీట్ల లోపు గెలుచుకోవచ్చునని అంచనాలు;
ఝార్ఖండ్ ఆసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలపై సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. అయితే మొత్తం 81 శాసనసభ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 41 సీట్లు గెలవాలి. మ్యాజిక్ ఫిగర్ 41 వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే అంచనాలపై పలు సర్వే సంస్థల ఫలితాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
పీపుల్స్ పల్స్: బీజేపీ కూటమి: 46-58, కాంగ్రెస్ (JMM) కూటమి: 24-37
మ్యాట్రిజ్ : బీజేపీ కూటమి: 42- 47, కాంగ్రెస్ (JMM) కూటమి: 25-30
చాణక్య : బీజేపీ కూటమి: 45 నుంచి 50, కాంగ్రెస్ (JMM) కూటమి: 35-38
టైమ్స్ నౌ: జేవీసీ - బీజేపీ కూటమి: 40- 44, కాంగ్రెస్ (JMM) కూటమి: 20-40
యాక్సిస్ మై ఇండియా : బీజేపీ కూటమి 25, ఇండియా కూటమి 53
దైనిక్ భాస్కర్ : బీజేపీ కూటమి: 37 నుంచి 40, కాంగ్రెస్ (JMM) కూటమి: 36-39
విజేతలెవరో..?
ఝార్ఖాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు గెలివాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రెండు కూటమి పార్టీలకు చాలా దగ్గరగా రావడంతో ఇక్కడి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.