JK BLAST: జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు
తొమ్మిది మంది మృతి.. 27 మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబోరెటరీ టీమ్, జమ్మూ కాశ్మీర్ సిబ్బంది, తహిశీల్దార్తో కలిసి పట్టుకున్న పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ను తనిఖీ చేస్తుండగా పేలింది. భారీ పేలుడు ధాటికి తొమ్మిది మంది చనిపోగా.. 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ 92 బేస్ హాస్పిటల్, శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. రెస్క్యూ టీమ్‌లు, స్నిఫర్ డాగ్‌లు, ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. పేలుడు ధాటి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రభావితం చూపగా.. స్థానికులను ఖాళీ చేయించారు. పోలీస్ స్టేషన్ తీవ్రంగా దెబ్బతినగా.. పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో భాగంగా పట్టుకున్న అమ్మోనియం నైట్రేట్ సుమారు 2900 కిలోగ్రాములు ఉన్నట్లు తెలుస్తోంది.