Karnataka: అవినీతి అధికారుల ఇళ్లలో లోకాయుక్త సోదాలు

కర్ణాటక వ్యాప్తంగా 48 ప్రాంతాల్లో తనిఖీలు... అధికారులపై అవినీతి ఆరోపణలు

Update: 2023-08-17 05:00 GMT

కర్ణాటక(Karnataka)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లల్లో లోకాయుక్త(Lokayukta) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఒకేసారి 48 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది‍(Raids underway at 48 locations‌). బీదర్, ధార్వాడ్, కొడగు, రాయచూర్, దావణగెరె, చిత్రదుర్గ సహా 48 ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే లోకాయుక్త అధికారులు సోదాలు చేస్తున్నారు. దావణగెరెలో బృహత్ బెంగళూరు మహానగర పాలకసంస్త (BBMP) మాజీ ఇంజనీర్, బీదర్‌లో ఓ కానిస్టేబుల్, కొడగులో సబ్ డిస్ట్రిక్ట్ అధికారి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తోంది. మైసూర్‌లోనూ వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హారంగి రిజర్వాయర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నివాసంలో జరుగుతున్నాయి. కొడగులోని ప్రియా పట్టణ జిల్లా కలెక్టర్ నివాసంలోనూ లోకాయుక్త సోదాలు చేయడం కలకలం రేపింది.


బెంగళూరులోని బనశంకరిలోని మహదేవపుర డివిజన్‌కు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నివాసంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అధికారులు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ అధికారుల ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో లోకాయుక్త విచారణ జరుపుతోంది.

Tags:    

Similar News