Kashmir Multiplex : కశ్మీర్‌లో కొత్త మల్టీప్లెక్స్.. మొదటి సినిమా ఏంటంటే..
Kashmir Muliplex : కశ్మీర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా;
Kashmir Multiplex : కశ్మీర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. శ్రీనగర్‌లో 520 మంది కెపాసిటీతో ఐనాక్స్ మల్టిప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. లాల్ సింగ్ చద్దా స్పెషల్ షో నడిపారు. ఇతర నగరాల్లో ఏ సదుపాయాలున్నాయో...అవే సదుపాయాలు ఇక్కడి ఐనాక్స్‌లోనూ కల్పించారు. ఉగ్రవాదం కారణంగా 90ల్లో ఇక్కడి కశ్మీర్ లోయలో థియేటర్లు మూతపడ్డాయి. అప్పట్లో దాదాపు 15 సినిమా హాల్స్ ఉండేవి.
1999-2000 మధ్యలో సినిమా హాల్స్ తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా...అది సఫలం కాలేదు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ సినిమాలను ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 30న హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద సినిమా స్క్రీనింగ్ చేయనున్నారు.