Murine Typhus: కేరళలో కొత్త రోగం, మురిన్ టైఫస్‌ లక్షణాలేంటంటే ?

ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?;

Update: 2024-10-15 06:30 GMT

కేరళ ప్రభుత్వాన్ని మరో అరుదైన వ్యాధి కలవర పెడుతోంది. ఆ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన మురిన్ టైఫస్ అనే వ్యాధిని వైద్యులు గుర్తించారు. 75 ఏండ్ల వ్యక్తి అరుదైన బ్యాక్టీరియల్ వ్యాధికి గురై హాస్పిట్లలో చేరాడు. వెంటనే అల్టర్ అయిన అధికారులు అతడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడితో పాటు అతడి వెంట ఉన్నవారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు ఇంతకీ మురిన్ టైఫస్ అంటే ఏంటి? ఈ వ్యాధి సోకితే కలిగే లక్షణాలు ఏంటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రికెట్సియా టైఫితో మురిన్ టైఫస్ వ్యాప్తి

కేరళకు చెందిన 75 ఏండ్ల వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. రీసెంట్ గా ఆయన ఫారిన్ టూర్ కు వెళ్లారు. వియత్నాం, కాంబోడియాలో తిరిగి వచ్చారు. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట లాంటి సమస్యలతో దవాఖానాలో చేరాడు. అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి లివర్ తో పాటు కిడ్నీల్లో సమస్యలున్నట్లు గుర్తించారు. చివరకు అతడికి మురిన్ టైఫస్ సోకినట్లు గుర్తించారు. మురిన్ టైఫస్ అనేది ఫ్లీ బర్న్ బాక్టీరియా అయిన రికెట్సియా టైఫి కారణంగా సోకుంతుంది. ఈ వ్యాధి సోకిన దోమ మనుషులను కరిచినప్పుడు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ఒక్కసారి దోమ శరీరంలోకి వెళ్తే జీవితాంతం దాని బాడీలో ఉండిపోతుంది. ఎలుకలు, ముంగిసల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. పెంపుడు జంతువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

లక్షణాలు

మురిన్ టైఫస్ అనేది మనిషి శరీరంలోకి ప్రవేశించిన 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, చర్మం మీద దద్దుర్లు వస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే, నెలల పాటు అలాగే ఉంటుంది. ఒక్కోసారి మనిషి మరణానికి కారణం అవుతుంది.

 చికిత్స

మురిన్ టైఫస్ కు ప్రస్తుతం ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఈ వ్యాధి చికిత్స కోసం డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాధిని నయం చేయకపోతే పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది.

 నివారణ

ఇంట్లో దోమలు, ఈగలు పెరగకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులకు సైతం దోమలు, ఈగలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. రెండు రోజులకు ఓసారి స్నానం చేయించాలి. తప్పని సరిగా టీకాలు వేయించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు, దోమలు రాకుండా చూసుకోవాలి.

Tags:    

Similar News