Bindu Ammini: సామాజిక కార్యకర్త బిందు అమ్మినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి..
Bindu Ammini: కేరళ కోజికోడ్ బీచ్‌లో సామాజిక కార్యకర్త బిందు అమ్మినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.;
Bindu Ammini (tv5news.in)
Bindu Ammini: కేరళ కోజికోడ్ బీచ్‌లో సామాజిక కార్యకర్త బిందు అమ్మినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వాహనం పార్కింగ్ చేస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో బిందు అతనిని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో అతను బిందుపై దాడి చేసి.. ఆమె ఫోన్ ను పగలకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.