Pahalgam Attack: పహల్గామ్ ఉగ్ర దాడిపై కీలక అప్‌డేట్

26 మందిని పొట్టనబెట్టుకున్న హంతకుడి పేరు లీక్;

Update: 2025-07-16 05:30 GMT

పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన స్థానికులను అరెస్ట్ చేశారు. అలాగే సంఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులను అధికారులు విచారించారు.

అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు తమ పని పూర్తి చేశాక.. సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు అధికారులకు వెల్లడించాడు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినట్లుగా పేర్కొన్నాడు.

ఇక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాట్కోట్ నుంచి పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్కు నుంచి బషీర్ అహ్మద్ జోథర్‌‌గా గుర్తించారు. బాట్కోట్, హిల్ పార్క్ రెండు ప్రాంతాలు కూడా పహల్గామ్‌లోనే ఉన్నాయి. విచారణలో ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఉగ్రవాదులు… లష్కరే తోయిబా (LeT)తో అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ పౌరులుగా నిర్ధారించారు. హిల్ పార్కులోని ఒక గుడిసెలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఆహారం, లాజిస్టికల్ మద్దతు అందించారు. ఇక పర్వైజ్, బషీర్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు.

ఇక ప్రత్యక్ష సాక్షి దర్యాప్తు సంస్థతో కీలక విషయాలు పంచుకున్నాడు. 26 మందిని చంపిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు వెళ్లిపోతుండగా తనను ఆపారని చెప్పాడు. కల్మా పఠించమని అడిగారని.. తాను స్థానిక యాసలో మాట్లాడడంతో తనను విడిచిపెట్టేశారని పేర్కొన్నాడు. అనంతరం సంతోషంగా నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పుకొచ్చాడు. ఇక పర్వైజ్, బషీర్ కొండ దగ్గర నిలబడి.. ఉగ్రవాదుల వస్తువులను చూసుకున్నారని వెల్లడించాడు. కాల్పులు అయిపోయాక.. ముష్కరులు వస్తువులు తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నాడు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. మతం ఆధారంగా దాడి చేశారు. ముస్లిం వ్యతిరేకులను 26 మందిని చంపేశారు. అయితే ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తు్న్నారు. ముగ్గురు పాకిస్థానీలు హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, ఆసిఫ్ ఫౌజీ, అనంతనాగ్ నివాసి అయిన స్థానిక ఉగ్రవాది అబిద్ హుస్సేన్ థోకర్ సహా నలుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

Tags:    

Similar News