Love Jihad : ఉత్తర్ ప్రదేశ్‌లో పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ ముఠా..ఇద్దరు మహిళలతో సహా 8 మంది అరెస్ట్..

అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన గ్యాంగ్..;

Update: 2025-07-28 01:30 GMT

 ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్‌సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.

ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు, సైబర్ సెల్ సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలికను సురక్షితంగా రక్షించారు. పోలీసులు రెండు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకదాంట్లో ఆమె పేరు నేహా శర్మగా, మరొక దాంట్లో మతం మార్చిన తర్వాత పర్వాణి ఖాటూన్ అనే పేరుతో ఉంది. 11 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుపై ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మహువా బుజుర్గ్‌కు చెందిన సునీల్ వర్మ తన కుమార్తెను బలవంతంగా మతం మార్చారని ఫిర్యాదు చేశారు. ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాము. అషిక్ అన్సారీ, ఇంతియాజ్, మొహమ్మద్ సహాబ్, మరికొందరు ఆమెను మతం మార్చి కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత దాచిపెట్టారు. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని చెప్పారు.

అరెస్టు చేసిన వ్యక్తులను తౌఫిక్ అన్సారీ, ఆషిక్ అన్సారీ మరియు అతని కుమారుడు ఇంతియాజ్, మొహమ్మద్ సహబ్ అన్సారీ, జీషన్ ఖమర్, మజార్ మరియు ఇద్దరు మహిళలు, కైజర్ జహాన్, ఫాతిమాగా గుర్తించారు. ముఖ్యంగా హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ మతం మార్చుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా బాధితురాలని చాలా కాలంగా వెంబడించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రలోభాలకు గురి చేసి మోసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి తౌఫిక్ అన్సారీ కొన్ని వీడియోలు, రికార్డును ఉపయోగించాడు. కైజర్ జహాన్, ఫాతిమా ఆ బాలికను మానసికంగా మోసగించడంలో కీలక పాత్ర పోషించారని, ఆమె మతపరమైన విషయాలను చూపించి ఆమె నమ్మకాలను ప్రభావితం చేశారని ఆరోపించారు. పరారీలో ఉన్న ఇతర ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News