Rajouri : రాజౌరిలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

భారీ మంచు తుఫాను, కొండచరియలు విరిగిపడడం ఆపరేషన్‌కు ఆటంకం

Update: 2025-10-08 02:45 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన కోట్రాంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిర్ గాలా పైన ఉన్న ధేరి ఖతుని ప్రాంతంలో జరిగింది. నివేదికల ప్రకారం, రాత్రి 7:20 గంటల సమయంలో ఆ ప్రాంతంలో 10 నుండి 15 రౌండ్ల కాల్పులు వినిపించాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

కాల్పులు ఆ ప్రాంతంలో భయాందోళనలకు దారితీశాయి. అప్రమత్తమైన అధికారులు అదనపు భద్రతా దళాలను సంఘటనా స్థలానికి తరలించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించిన 43 RR (రాజ్‌పుతానా రైఫిల్స్) విభాగం ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతోంది. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు జరగలేదు.

నివేదికల ప్రకారం, నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి భద్రతా బలగాలు. భారీ మంచు తుఫాను, కొండచరియలు విరిగిపడడం ఆపరేషన్‌కు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండటానికి ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. సైనిక డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి ఉగ్రవాదుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News