Uttara Pradesh : వివాహానికి వెండి చెప్పులు

లేటెస్ట్ ట్రెండ్ క్రియేట్ చేసిన జ్యువలరీ షాప్ యజమాని

Update: 2023-07-24 06:45 GMT

ఏ పెళ్లికి వేసుకునే బట్టలు, జ్యువలరీ మాత్రమే అద్భుతంగా ఉండాలా చెప్పులు బాగా ఉండకూడదా అని ఆలోచించాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ నగల షాప్ యజమాని వినోద్ . పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో పెళ్లికూతుర్ల కోసం వెండి పాదరక్షలను రూపొందించారు. పనిలో పనిగా పెళ్లి కొడుకు కోసం వెండి బెల్ట్ కూడా రెడీ చేసాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఓ నగల దుకాణ యజమాని కొత్తగా ఆలోచించాడు. పెళ్లిలో యువతులు ధరించే నగలే కాకుండా పాదరక్షలు మిల మిల మెరిసేలా చేయాలని డిసైడ్ అయ్యాడు. వెండితో పాదరక్షలను తయారు చేసి, దానిపై రత్నాలు, ముత్యాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దాడు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ పాదరక్షల ధర రూ.25 వేలు. వధువు కోసం మాత్రమే కాదు వరుడు కోసం కూడా ఇలా ప్రత్యేకంగా పాదరక్షలను తయారు చేస్తున్నారు.

వినియోగదారుల నుంచి స్పందన కూడా ఆశించిన దానికంటే ఎక్కువగానే వస్తుండటం తోఇక మిగతా వస్తువులను వెండితో రూపొందిస్తున్నారు. పెళ్లికూతురు వడ్డాణం పెట్టుకుంటే, పెళ్లి కొడుకు బెల్ట్ పెట్టుకుంటాడు. సో ఇప్పుడు ఆ బెల్ట్ ని కూడా వెండితో చేశారు వినోద్. బరువు, డిజైన్‌ ఆధారంగా దీని ధరను 20 వేలుగా నిర్ణయించారు. అంతే కాదు రిచ్ గా ఉండాలని కోరుకునే పెళ్లి వాళ్ళ కోసం వెండి పర్స్ కూడా తయారు చేశారు. ప్రత్యేకంగా వరుడి కుటుంబ సభ్యులకు కావాల్సిన ఇతర వస్తువులను వెండితోనే తయారు చేస్తున్నారు. ఈ వస్తువులపై వినియోగదారులు సైతం ఆసక్తి కనబరుస్తుండటంతో మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకొస్తామని వినోద్ చెబుతున్నారు.

Tags:    

Similar News