MahaKumbh Mela: నేటితో మహా కుంభమేళా ముగింపు

నో వెహికిల్‌ జోన్‌గా ప్రయాగ్‌రాజ్‌;

Update: 2025-02-26 00:30 GMT

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇదే రోజు మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు మళ్లీ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్‌ జోన్‌’గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్తర్వులు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఎంట్రీ పాయింట్‌ సమీపంలోని స్నాన వాటికల వద్దే భక్తులు పుణ్య స్నానాలు చేయాలని, తాజా గైడ్‌లైన్స్‌ పాటించాలని అధికారులు కోరారు. నిత్యావసర సరుకులను తరలించే వాహనాలకు, వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. దాదాపు 6 వారాల పాటు ఈ ఉత్సవం సాగుతోంది. ఈ కుంభమేళా 2 వేల సంవత్సరాలు క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కుంభమేళా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు వచ్చే భక్తులంతా పాపాలు పోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది.

ఫిబ్రవరి 26న ముగిసే నాటికి యాత్రికుల సంఖ్య దాదాపు అర బిలియన్ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు, విమానాలు, బస్సులు, కార్లు.. ఇలా రకరకాలైన ట్రావెలింగ్ ద్వారా భక్తులు తరలివచ్చారు. ఇక యూపీ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 7,500 ఫుట్‌బాల్ మైదానాల కంటే పెద్ద విస్తీర్ణంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. 150,000 టాయిలెట్లు, 30 తేలియాడే వంతెనలు, 70,000 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఇక తప్పిపోయే వారి కోసం 24 గంటలు పని చేసేలా 10 సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈ వారంలో కూల్చేస్తారు. ఇక జనవరి 29న తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కూడా తొక్కిసలాట కారణంగా 18 మంది చనిపోయారు.

Tags:    

Similar News