Mamata Banerjee: మోడీతో మమతా బెనర్జీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీని కలిశారు.;
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీని కలిశారు. నీతి ఆయోగ్ సెషన్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన మమత.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ప్రధానితో మమత చర్చించారు. పశ్చిమ బెంగాల్ జీఎస్టీ బకాయిలపై కూడా దీదీ ప్రధానమంత్రి మోడీ వద్ద చర్చించారు. కాసేపట్లో బెంగాల సీఎం బెంగాల్‌సీఎం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. అలాగే ప్రధాని మోడీ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మమత పాల్గొననున్నారు.